ఖమ్మం నగర ప్రజల అభివృద్ధి, సంక్షేమం బాధ్యత తనదేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టంచేశారు. రానున్న రోజుల్లో ఏ పరిణామాలు జరిగినా బాధ్యత తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. నగర ప్రజల బాధ్యత తీసుకునేందుకు ప్రతిపక్ష పార్టీల్లో ఒక్క నాయకుడైనా ముందుకొస్తారా అని సవాల్ విసిరారు. నగరంలోని ముస్తఫానగర్ జంక్షన్లో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కాంస్య విగ్రహాన్ని మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నగరం అభివృద్ధిలో నిర్లక్ష్యానికి గురైందన్నారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెరాస సిద్ధం: మంత్రి పువ్వాడ - telangana varthalu
ఖమ్మం నగరపాలక సంస్థకు ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెరాస సిద్ధంగా ఉందని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. నగర ప్రజల అభివృద్ధి, సంక్షేమం బాధ్యత తనదేనని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెరాస సిద్ధం: మంత్రి పువ్వాడ
తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా అభివృద్ధి పథంలోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. నగరపాలక సంస్థకు ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెరాస సిద్ధంగా ఉందన్న మంత్రి.. గ్రూపులకు తావులేకుండా ఒకే ఒక్క గ్రూపు కేసీఆర్ గ్రూపుగా పనిచేసి గెలిపిస్తామన్నారు. నగరంలో కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని.. ప్రజలు, మతాల మధ్య చిచ్చు రేపి, విద్వేషాలు రగిల్చి ఓట్లు దండుకుంటామంటే ఖమ్మంలో చెల్లదన్నారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన గవర్నర్