ఖమ్మం జిల్లావ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయటానికి... 444 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. జిల్లాలో వరి కోత యంత్రాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.
ప్రతి గింజను కొనుగోలు చేస్తాం: పువ్వాడ అజయ్ - ధాన్యం సేకరణ కేంద్రాలు సిద్ధం
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. అన్నదాతలు ఎవరూ అధైర్య పడొద్దన్నారు. ధాన్యం సేకరణకు ప్రభుత్వం రూ.35 వేలకోట్లు సమకూర్చిందని పేర్కొన్నారు.
Minister Puvvada Ajay said We buy every nut
పంచాయతీల వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు భౌతిక దూరం పాటించాలని సూచించారు. మొబైల్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.