ఖమ్మం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. ఛైర్మన్ లింగాల కమల్ రాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.
అంటువ్యాధుల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి: లింగాల - khammam jilla parishad meeting
ఖమ్మంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ హాజరయ్యారు. వానాకాలంలో వచ్చే అంటువ్యాధులను నివారించేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
'అంటువ్యాధులను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి'
కరోనా వైరస్ నివారణలో భాగంగా సభ్యులు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ... భౌతిక దూరం పాటించారు. ప్రధానంగా కరోనా వైరస్ నివారణ కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతుగా తీర్మానం చేశారు. వానాకాలంలో అంటు వ్యాధులను అరికట్టే విధంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. నియంత్రిత వ్యవసాయంపై చర్చించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో సాగును విజయవంతం చేయాలని నిర్ణయించారు.