తెలంగాణ రైతులు రాజులుగా మారే రోజు వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచిలో రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వానాకాలం సీజన్లో రైతులు.. వ్యవసాయ అధికారులు సూచించిన విత్తనాలనే వాడాలని కోరారు.
రైతు వేదిక భవనానికి మంత్రి శంకుస్థాపన - minister puvvada ajay kumar visited khammam
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచిలో రైతు వేదిక భవనానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. తన సొంత డబ్బుతో రైతు వేదిక భవనాన్ని నిర్మిస్తోన్న ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిని మంత్రి అభినందించారు.
సీతారామ ప్రాజెక్టు ద్వారా పాలేరు నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని మంత్రి తెలిపారు. భూమి కోల్పోతున్న రైతులు ఆందోళన చెందవద్దని, ముఖ్యమంత్రితో మాట్లాడి పరిహారాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు. రైతుల కోసం సొంత డబ్బుతో రైతు వేదిక భవన నిర్మిస్తున్న ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిని మంత్రి అభినందించారు.
తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రైతు వేదిక భవనాన్ని నిర్మిస్తున్నానని ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయకర్త నల్లమల వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, సర్పంచ్ మోహన్ పాల్గొన్నారు.
- ఇదీ చూడండి:సీఎం కేసీఆర్‌కి రైతన్న బహుమానం