తెలంగాణ

telangana

ETV Bharat / state

దసరాకు అందుబాటులోకి ఖమ్మం ఐట్ హబ్​: మంత్రి పువ్వాడ - ఐటీ హబ్​ను సందర్శించిన మంత్రి పువ్వాడ కుమార్

ఖమ్మం ఐటీ హబ్​ను దసరాకు ప్రారంభిస్తామని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ నెలాఖరుకు నిర్మాణ పనులన్నీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ 10 కల్లా ఎంవోయూ చేసుకున్న కంపెనీల కార్యకలాపాలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగాల్లో స్థానిక యువకులకే ప్రాధాన్యం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.

puvvada ajay kumar
puvvada ajay kumar

By

Published : Aug 29, 2020, 2:03 PM IST

ఖమ్మం నగరానికి తలమానికమైన ఐటీ హబ్​ను దసరాకు ప్రారంభించేలా నిర్మాణ పనులను వేగవంతం చేసినట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ నెలాఖరుకు నిర్మాణ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్ 10 కల్లా ఎంవోయూ చేసుకున్న కంపెనీల కార్యకలాపాలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇల్లెందు క్రాస్ రోడ్డులో నిర్మిస్తోన్న ఐటీ హబ్​ను పనులను కలెక్టర్ కర్ణన్​తో కలిసి మంత్రి పువ్వాడ పర్యవేక్షించారు. అంతకుముందు 3వ డివిజన్​లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​... జిల్లా పర్యటన ఖరారైతే సీఎం చేతుల మీదుగా లేకుంటే ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ హబ్​ను ప్రారంభించనున్నట్లు పువ్వాడ తెలిపారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచడంతోపాటు కావాల్సిన మౌలిక వసతుల కల్పన వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఐటీ హబ్ ఉద్యోగాల్లో స్థానిక యువతకు అధిక ప్రాధాన్యం కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

దసరాకు అందుబాటులోకి ఖమ్మం ఐట్ హబ్​: మంత్రి పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details