ఏటా ఖమ్మం జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో జరగాల్సిన స్వాతంత్ర వేడుకలు.. ఈసారి కరోనా ప్రభావంతో జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు. అతి కొద్దిమందితోనే వేడుకలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైనప్పటికీ.. ఏకధాటిగా వర్షం కురవడం వల్ల సాదాసీదాగా నిర్వహించాల్సి వచ్చింది.
కలెక్టరేట్లో మంత్రి జెండా ఆవిష్కరణ...
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. పరేడ్, ఉపన్యాసం లేనందున జిల్లా ప్రగతి నివేదిక విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్లుగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా కృషి చేస్తోందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి పునరంకితమై పని చేస్తామన్నారు. ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవతంగా పూర్తి చేసి లక్ష్యాలు చేరుకుంటామన్నారు.
వచ్చే స్వాతంత్ర దినోత్సవానికి ముందే...