ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఓటరు నమోదు ప్రక్రియ బాధ్యతగా చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెరాస శ్రేణులకు సూచించారు. శాసన మండలి ఓటరు నమోదుపై ఖమ్మం జిల్లాలో తొలి ఎన్నికల సన్నాహక సమావేశాన్ని వైరాలో నిర్వహించారు. సమావేశానికి హాజరైన మంత్రి ఓటరు నమోదుపై పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వాలు, ఎక్కువ మంది ప్రజా ప్రతినిధులు ఉన్న పార్టీ కూడా తెరాసనేనని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటరు నమోదును చురుగ్గా చేపట్టాలన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై తెరాస శ్రేణులకు మంత్రి మార్గనిర్ధేశం - ట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఓటరు నమోదును చురుగ్గా చేపట్టాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెరాస శ్రేణులకు సూచించారు. రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను వివరిస్తూ నమోదు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి స్పష్టం చేశారు.
ఉపాధ్యాయ సంఘాలు, విశ్రాంత ఉద్యోగులు, ఎల్ఐసీ ఏజెంట్లు, ప్రైవేటు అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఇలా ఎక్కువ మంది ఉన్న ప్రాంతాల్లో శాసనమండలి ఓటరు నమోదు చేయాలని తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ పరిశీలకులు, జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను వివరిస్తూ నమోదు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్ మార్క్‌ఫెడ్ వైస్‌ఛైర్మన్ బొర్ర రాజశేఖర్, తెరాస రాష్ట్ర నాయకులు నరేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: వర్షం పడితే నీళ్లు రాకపోతే... నిప్పులు వస్తాయా?: మంత్రి తలసాని