ఖమ్మం నగరంలో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర మంత్రులు డిసెంబర్ 2న జిల్లాకు రానున్నట్లు రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్ తెలిపారు. నగరంలో పూర్తియిన ధ్వంసలాపురం ఆర్వోబీ, ఐటీ హబ్, పోలీసు కమిషనరేట్ నూతన భవనాలను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, మహమూద్ అలీలు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. నగరంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు చేత ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
డిసెంబర్ 2న ఖమ్మానికి కేటీఆర్ రాక: మంత్రి అజయ్ - ఖమ్మంకు రానున్న మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి
అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీ ఖమ్మం వస్తారని మంత్రి అజయ్ కుమార్ వెల్లడించారు. నగరంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు చేత ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులచేత ప్రారంభిస్తాం: మంత్రి అజయ్ కుమార్
అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియగా సాగుతుందని అజయ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు త్వరలోనే మున్నేరుపై కరకట్ట, చెక్‌డ్యాం తదితర పనులకు ప్రణాళికలు సిద్దం చేయనున్నట్లు ఆయన చెప్పారు.
ఇదీ చదవండి:'వరదసాయం కింద కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు'