ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పర్యటించారు. ముజ్జుగూడెం గ్రామంలో కలెక్టర్ ఆర్.వి కర్ణన్తో కలిసి వైకుంఠధామాన్ని ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వానాకాలంలో సాగు విధానంపై అవగాహన సదస్సులో పాల్గొన్నారు. రైతుల అభివృద్ధి కోసమే నియంత్రిత సాగు విధానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారని తెలిపారు.
'నియంత్రిత సాగు విధానంతో రైతులకు లాభం' - నియంత్రిత సాగు విధానం
రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించటం కోసమే సీఎం కేసీఆర్ నియంత్రిత సాగు విధానాన్ని ప్రవేశ పెట్టారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. అన్నదాతలు వానాకాలంలో మొక్కజొన్న పంటను వేయవద్దని సూచించారు. ప్రభుత్వం సూచించిన పత్తి, సన్న రకం వరిని మాత్రమే వేయాలని తెలిపారు.
నియంత్రిత సాగు విధానంతో రైతులకు లాభం
రాబోయే కాలంలో సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా పాలేరు నియోజకవర్గాన్ని సస్యశామలం చేస్తామని హామీ ఇచ్చారు. 15 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు ప్రారంభం కాబోతోందని తెలిపారు. రైతులు వానాకాలంలో మొక్కజొన్న పంట వేయవద్దని సూచించారు. సమగ్ర పంటల విధానానికి రైతులు కట్టుబడి ఉండాలని... అన్నదాతలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు. రైతులందరూ వర్షాకాలంలో పత్తి పంటను ఎక్కువగా వేయాలని వరిలో సన్నరకం విత్తనాలు వాడాలని సూచించారు.