తెలంగాణ

telangana

ETV Bharat / state

అందుకోసమే 8 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం: పువ్వాడ - తల్లాడలో పర్యటించిన మంత్రి పువ్వాడ వార్తలు

కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రజలు సీజనల్​ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం 8 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని రూపొందించిందని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో పారిశుద్ధ్య వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

minister-puvvada-ajay-kumar-participated-in-special-sanitation-program-in-khammam
అందుకోసమే 8 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం: పువ్వాడ

By

Published : Jun 8, 2020, 12:46 PM IST

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం 8 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టినట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో పారిశుద్ధ్య వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లాడ రింగ్‌రోడ్‌ కూడలిలో రహదారి వెంట పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఓ దుకాణం ఎదుట చెత్త వేసి ఉండటం వల్ల ఆ దుకాణదారుడికి జరిమానా విధించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. అనంతరం అంజనాపురంలో రూ.1.5 కోట్లతో నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య వారోత్సవాల ముగింపు సభలో మంత్రి మాట్లాడారు.

''పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు జిల్లా యంత్రాంగం చక్కటి కృషి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆర్​.వి. కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ స్నేహలతలను అభినందిస్తున్నా. అందరి సహకారంతో 33 జిల్లాల్లో ఖమ్మం 2వ స్థానంలో నిలిచింది. దీనికి గర్వపడుతున్నాను. పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ. కరోనా విజృంభిస్తున్న సమయంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా బడ్జెట్‌ నుంచి గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా నిధులు కేటాయిస్తున్నారు. ప్రజాప్రతినిధులు వీటిని సద్వినియోగం చేసుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి.''

-పువ్వాడ అజయ్​కుమార్​, మంత్రి

కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ రాయల వెంకట శేషగిరిరావు, రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇదీచూడండి: దేశవ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు- మాస్కులతో భక్తులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details