ఖమ్మంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. ఇప్పటి వరకు జరిగిన పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల్లో అలసత్వం వహించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. ఖమ్మం నగరంలో సుడా నిధులతో జరుగుతున్న పనులు, గోళ్లపాడు ఛానల్, ముఖ్యమంత్రి హామీల పనులు, మిషన్ భగీరథ, మార్కెట్ల నిర్మాణాలు, వైకుంఠధామాల్లో అదనపు వసతులు, తదితర పెండింగ్ పనులపై సమీక్షించారు.
PUVVADA: పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు: పువ్వాడ అజయ్ - మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష
ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తప్పవని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు.
ఖమ్మం అభివృద్ధి పనులపై మంత్రి పువ్వాడ సమీక్ష
పనుల జాప్యం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అమృత్ పథకం ద్వారా 192 కోట్ల రూపాయలు విడుదల చేసినప్పటికీ పనులు పూర్తి చేయనందుకు గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని ఈఏన్సీని మంత్రి పువ్వాడ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, అధికారులు పాల్గొన్నారు.