తెలంగాణ

telangana

ETV Bharat / state

ధైర్యంగా ఉందాం... కొవిడ్​ను జయిద్దాం: పువ్వాడ - కొవిడ్ పరిస్థితులపై మంత్రి సమీక్ష

కొవిడ్ సోకినవారు మనోధైర్యంతో ఉండాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. రెండో దశలో వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఖమ్మం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

minister puvvada ajay kumar
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

By

Published : May 10, 2021, 11:02 PM IST

ప్రజలు ధైర్యంతోనే కొవిడ్​ను జయించాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రెండో దశలో వైరస్ విజృంభిస్తున్న తరుణంలో బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాల్లో ధైర్యం నింపాలని పేర్కొన్నారు. ఆస్పత్రులు, కొవిడ్ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. వైరస్ నివారణకు కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఆక్సిజన్, రెమ్​డెసివిర్ కొరత లేకుండా చూడాలని మంత్రి పువ్వాడ అజయ కుమార్ అధికారులకు వివరించారు.

ఇదీ చూడండి:వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద జనం బారులు... రెండో డోసు కోసం నిరీక్షణ

ABOUT THE AUTHOR

...view details