తెలంగాణ

telangana

ETV Bharat / state

Sneha latha mogili ias: సర్కార్ దవాఖానాలో కలెక్టర్ ప్రసవం.. మంత్రి అభినందనలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం అంటే చాలామంది భయపడుతుంటారు. చేతిలో డబ్బులు లేకున్నా సరే... తల్లీబిడ్డ క్షేమంగా ఉంటేచాలని చాలామంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తుంటారు. ఇటీవల కాలంలో సర్కార్ తీసుకున్న చర్యలతో కొందరు ప్రభుత్వ ఆస్పత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు. నేపథ్యంలో ఓ అడిషినల్ కలెక్టర్(Sneha latha mogili ias) కూడా సర్కార్ దవాఖానాలో పండంటి బిడ్డకు జన్మనిచ్చి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ ఉన్నతాధికారి దంపతులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు.

collector
collector

By

Published : Oct 24, 2021, 2:23 PM IST

Updated : Oct 24, 2021, 4:27 PM IST

అధికారులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవడం చాలా అరుదు. అయితే ఓ ఉన్నతాధికారి ఏకంగా సర్కార్ దవాఖానాలో ప్రసవించి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఆమే ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత(Sneha latha mogili ias). ఐఏఎస్ స్నేహలత, భద్రాద్రి కొత్తగూడెం ఏఎస్​పీ శబరీస్​ దంపతులకు ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డ జన్మించింది. వీరిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు.

పాపాయిని ఎత్తుకున్న మంత్రి

పేదల గుడి అయిన ప్రభుత్వ ఆస్పత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని మంత్రి అన్నారు. అదనపు కలెక్టర్ స్నేహలత(Sneha latha mogili ias) దంపతులు ఎంతోమందికి ఆదర్శమని కొనియాడారు. ఇద్దరూ ఉన్నతాధికారులు అయినప్పటికీ సామాన్యుల్లాగా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసూతి సేవలు పొందారు. సర్కార్ దవాఖానాలో ప్రసవించి... ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచారని పలువురు ప్రశంసిస్తున్నారు.

అదనపు కలెక్టర్​ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని నెటిజన్లు అంటున్నారు. మంత్రి వెంట మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత, ఏఎంసీ ఛైర్మన్ లక్ష్మిప్రసన్న, డీఎంహెచ్​వో మాలతి, సూడా ఛైర్మన్ విజయ్, వైద్యులు తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి:Lovers Suicide: ప్రియురాలికి పెళ్లి కుదిరిందని.. ప్రేమజంట ఆత్మహత్య

Last Updated : Oct 24, 2021, 4:27 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details