తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు వేదిక నిర్మాణానికి మంత్రి పువ్వాడ శంకుస్థాపన - ఖమ్మం జిల్లా

ఖమ్మం జిల్లా అడవిమల్లెలలో రైతు వేదిక నిర్మాణానికి రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. లంకాసాగర్ మధ్యతరహా జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేశారు.

రైతు వేదిక నిర్మాణానికి మంత్రి పువ్వాడ శంకుస్థాపన
రైతు వేదిక నిర్మాణానికి మంత్రి పువ్వాడ శంకుస్థాపన

By

Published : Jul 21, 2020, 3:29 PM IST

ఖమ్మం జిల్లాలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రైతును రాజు చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు. దసరా నాటికి జిల్లాలోని అన్ని రైతు వేదికలు కల్లాలు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. రైతులంతా ఒకచోట చేరి వ్యవసాయంపై చర్చించుకునేదే ఈ రైతు వేదిక అని పేర్కొన్నారు. అన్నదాతల సంక్షేమానికి రైతు వేదిక ఎంతో దోహదపడుతుందన్నారు. రైతుల సమావేశ నిర్వహణకు, ఇతర అవసరాలకు అనుగుణంగా రైతు వేదికలను నిర్మిస్తున్నామన్నారు.

రెండు పంటలకు సీతారామ నీరు...

జిల్లాలోని ప్రతి ఎకరా సాగులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని... సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు పంటలకు పుష్కలంగా నీటిని అందించి సస్యశ్యామలం చేస్తామని వివరించారు. గోదావరి నది మీద వడివడిగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అనేక జిల్లాలకు ఈ ఏడాది దండిగా నీరు అందనుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహలత, జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, ఆర్డీవో సూర్యనారాయణ, సర్పంచ్ అశోక్ , జడ్పీటీసీ సభ్యుడు మోహన్ రావు, వైస్ ఎంపీపీ కస్తూరి తదితరులు పాల్గొన్నారు.

రైతు వేదిక నిర్మాణానికి మంత్రి పువ్వాడ శంకుస్థాపన

ఇవీ చూడండి : నీటిపారుదల శాఖ జలవనరుల శాఖగా మార్పు: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details