ఖమ్మం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఖమ్మం పట్టణం మినహా...జిల్లాలో మిగతా అన్ని ప్రాంతాల్లోనూ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తిని పూర్తిగా కట్టడి చేయడమే లక్ష్యమంటున్న మంత్రి పువ్వాడ అజయ్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
'ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా కట్టడే మా లక్ష్యం' - ఖమ్మంలో కరోనా వార్తలు
ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. పాజిటివ్ కేసులు ఏడుకు చేరడం... వీరిలో ఒకే కుటుంబంలో ఐదుగురికి వైరస్ సోకడంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని మంత్రి వివరించారు.
'ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా కట్టడే మా లక్ష్యం'