తెలంగాణ

telangana

ETV Bharat / state

మరో అందాన్ని సంతరించుకోనున్న ట్యాంక్​ బండ్​ - ఖమ్మం జిల్లా తాజా వార్తలు

ఖమ్మం జిల్లాలోని లకారం ట్యాంక్‌ బండ్‌ మరో అందాన్ని సంతరించుకోనుంది. రూ.కోటి 75 లక్షలతో నిర్మించిన డ్యాన్సింగ్‌ ఫౌంటెన్‌ ట్రయల్‌ రన్‌ ప్రారంభమైంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ట్రయల్‌ రన్‌ను మంగళవారం రాత్రి పరిశీలించారు.

Minister Puvvada Ajay Kumar inspecting a dancing fountain at Lakaram Tank Bund in Khammam District
మరో అందాన్ని సంతరించుకోనున్న ట్యాంక్​ బండ్​

By

Published : Apr 14, 2021, 2:13 AM IST

ఖమ్మం జిల్లాలోని లకారం ట్యాంక్‌ బండ్‌లో రూ.కోటి 75 లక్షలతో నిర్మించిన డ్యాన్సింగ్​ ఫౌంటెన్​ ట్రయల్​ రన్​ను మంగళవారం రాత్రి ప్రారంభించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ ట్రయల్​ రన్​ను పరిశీలించారు.

త్వరలో ఫౌంటెన్​ను ప్రారంభించనున్న నేపథ్యంలో లకారం ట్యాంక్​ బండ్​ మరో కొత్త అందాన్ని సంతరించుకోనుంది. ట్యాంక్ బండ్​ వద్ద రంగు రంగుల అందాలను విరజిమ్ముతున్న ఫౌంటెన్‌ను చూసేందుకు నగర ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆ అందమైన దృశ్యాలను తమ చరవాణుల్లో బంధించారు.

ఇదీ చదవండి: 'కోర్టు ధిక్కరణ అప్పీళ్లలో ఆ వివరాలు తప్పనిసరి'

ABOUT THE AUTHOR

...view details