ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, వైద్య అధికారులతో కలిసి టీకా కేంద్రాన్ని సందర్శించారు.
వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ - తెలంగాణ వార్తలు
భక్త రామదాసు కళాక్షేత్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పరిశీలించారు. టీకా ఇస్తున్న తీరుని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. టీకా తీసుకున్న ప్రజలతో ఆయన మాట్లాడారు.
భక్తరామదాసు కళాక్షేత్రంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాజా వార్తలు
టీకా పంపిణీ వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. టీకాలు తీసుకున్నవారితో మాట్లాడారు. రెండో డోసు మాత్రమే ఇస్తుండడం వల్ల రద్దీ కాస్త తగ్గుముఖం పట్టింది. టీకా కోసం వచ్చిన వారిలో వృద్ధులే అధిక సంఖ్యలో ఉన్నారు.
ఇదీ చదవండి: 'హ్యాపీ హైపోక్సియా'ను ఎలా గుర్తించాలి?