తెలంగాణ

telangana

By

Published : May 18, 2021, 9:13 AM IST

ETV Bharat / state

కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తాం: మంత్రి పువ్వాడ

కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. మందులు, ఆక్సిజన్​కు ఎటువంటి కొరత లేకుండా చూస్తామని తెలిపారు.

minister puvvada ajay kumar, penuballi isolation center
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పెనుబల్లి కొవిడ్ ఐసోలేషన్ కేంద్రం

కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కృషితో నియోజకవర్గంలో కొవిడ్ రోగుల కోసం రెండు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్​ సదుపాయం ఉన్న 25పడకలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. రూ.9 లక్షల విలువైన నూతన మొబైల్ ఎక్స్​రే యంత్రాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్ కర్ణన్​తో కలిసి మంత్రి ప్రారంభించారు.

జిల్లాలో ఆక్సిజన్, మందులకు ఎటువంటి కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వైద్యశాలలో పేదలకు కార్పొరేట్ తరహాలో చికిత్స అందించే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హామీ ఇచ్చారు. కరోనా రోగులు పెరుగుతుండటం వల్ల సత్తుపల్లి, పెనుబల్లి ఏరియా ఆస్పత్రుల్లో కొవిడ్ వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైన వైద్య సిబ్బందిని తాత్కాలిక పద్ధతిపై నియమించుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. కరోనా రోగులకు దాతల సహకారంతో ఆహారం... సింగరేణి సంస్థ సహకారంతో నిత్యం మినరల్ వాటర్ బాటిల్ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో ఈ వైద్యశాలకు అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీటీసీ సభ్యుడు మోహన్ రావు, సర్పంచ్ తావు నాయక్, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:బ్లాక్​ ఫంగస్​ : లక్షణాలు.. నిర్ధరణ.. చికిత్స ఏంటంటే?

ABOUT THE AUTHOR

...view details