తడి, పొడి చెత్త వేరు చేసే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడితే.. స్వచ్ఛ ఖమ్మం నగరం కల వీలైనంత త్వరలో సాకారమవుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అధికారులు, స్వచ్ఛంధ సంస్థలు, మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ బాధ్యతను తమ భుజ స్కందాలపై వేసుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్ మైదానంలో ఏర్పాటు చేసిన తడి, పొడి చెత్తపై అవగాహన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ ఆర్.వి. కర్ణన్‌తో కలిసి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెత్త సేకరణ ఆటోలను మంత్రి ప్రారంభించారు.
స్వచ్ఛ ఖమ్మం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: పువ్వాడ - MINISTER PUVVADA LATEST NEWS
స్వచ్ఛ ఖమ్మం నగరం కల సాకారానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. తడి, పొడి చెత్త వేరు చేసే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని సూచించారు. ఖమ్మంలోని పెవిలియన్ మైదానంలో ఏర్పాటు చేసిన చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
స్వచ్ఛ ఖమ్మం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: పువ్వాడ
నగరంలో ఉన్న 75 వేల గృహాల్లో ప్రతి ఇంటికీ తడి, పొడి చెత్త బుట్టలు అందించాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రజలు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడవేయకూడదని సూచించారు. స్వచ్ఛ ఖమ్మం నగరం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.