ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై, వరద పరిస్థితిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల వారిగా అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్న మంత్రి ... ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు, సూచనలు ఇచ్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వరద పరిస్థితిపై మంత్రి పువ్వాడ సమీక్ష - khammam rain news
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుణుడు ప్రతాపం చూపెడుతున్నాడు. గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగుపారుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వరద పరిస్థితిపై మంత్రి పువ్వాడ సమీక్ష
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి పువ్వాడ ... సహాయ చర్యలు, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆయన నివేదిస్తున్నారు.