Puvvada comments on bjp: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానిది అసత్య ప్రచారమని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. రాష్ట్ర మంత్రులకు సమయం ఇవ్వని భాజపా పెద్దలు నీతులు చెప్తున్నారని మంత్రి మండిపడ్డారు. బండి సంజయ్ ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ మాట తప్పినందుకా అంటూ ఎద్దేవా చేశారు.
కొందరు చిన్న పిల్లలపై అత్యంత నీచంగా మాట్లాడుతున్నారని మంత్రి పువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నందునే సహనంతో ఉన్నామన్న మంత్రి.. కార్యకర్తల ఆవేశం కట్టలు తెంచుకుంటే పరిస్థితి ఏంటన్నారు.
ఆవేశం కట్టలు తెంచుకుంటే..