ఖమ్మం నగరపాలక సంస్థ అభివృద్ధి తెరాసతోనే సాధ్యమవుతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బల్దియా ఎన్నికల సందర్భంగా నగరంలోని పలు డివిజన్లలో మంత్రి ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలు, ర్యాలీలతో తెరాస అభ్యర్థుల పక్షాన ఓట్లు అభ్యర్థించారు. కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ తెరాసకు ఓటేయాలని ప్రజలను కోరారు.
తెరాసతోనే ఖమ్మం అభివృద్ధి సాధ్యం: మంత్రి పువ్వాడ - khammam municipal elections news
ఖమ్మం నగరపాలక ఎన్నికల ప్రచారంలో తెరాస దూకుడు పెంచింది. అభ్యర్థుల తరఫున మంత్రులు ప్రచారంలోకి దిగుతున్నారు. నగరంలోని పలు డివిజన్లలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రోడ్ షో నిర్వహించారు.
ఖమ్మంలో మంత్రి పువ్వాడ ప్రచారం
ఖమ్మం అభివృద్ధిని సీఎం కేసీఆర్ మెచ్చుకున్న సంగతి ప్రజలు గుర్తించాలని మంత్రి సూచించారు. కార్పొరేషన్లో అన్ని స్థానాలను గెలిపించి ప్రజలు తనకు మద్దతిస్తే... నగరాన్ని మరింత అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు.