ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల్లో ప్రభుత్వం పురోగతి సాధించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో నిర్వహించిన నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల సన్నాహక సమావేశానికి... తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
నీళ్లు, నిధులు, నియామకాల్లో రాష్ట్రం పురోగతి: పువ్వాడ - ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం జిల్లా ఏన్కూరులో నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి అజయ్ కుమార్, తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
![నీళ్లు, నిధులు, నియామకాల్లో రాష్ట్రం పురోగతి: పువ్వాడ minister puvvada ajay kumar attend to graduate mlc election meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10487351-492-10487351-1612355467018.jpg)
నీళ్లు, నిధులు, నియామకాల్లో రాష్ట్రం పురోగతి: పువ్వాడ
ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రతి కార్యకర్త పట్టభద్రులను చైతన్యపరిచి శాసనమండలి ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో విజయం సాధించేలా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
TAGGED:
Puvvada