ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లోటు లేకుండా ఉండేందుకు... మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చర్యలు తీసుకున్నారు. భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డు అధికారులతో చర్చలు జరిపి రోజూ 5 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసేవిధంగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆక్సిజన్‌ను జిల్లా ఆస్పత్రిలోని ట్యాంకర్లో నిల్వచేస్తామని... అవసరం ఉన్న ఆస్పత్రుల వారు వచ్చి తీసుకువెళ్లవచ్చన్నారు.
ఆక్సిజన్ అందలేదన్న ఫిర్యాదు రాకూడదు: పువ్వాడ - Khammam district latest news
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొవిడ్ రోగులకు ఆక్సిజన్ అందలేదన్న ఫిర్యాదు రాకూడదని... మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డు అధికారులతో చర్చలు జరిపి రోజూ 5 టన్నుల ఆక్సిజన్... జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి సరఫరా చేసే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆక్సిజన్ సరఫరాకు మంత్రి పువ్వాడ చర్యలు
జిల్లాలో ఆక్సిజన్ అందలేదన్న వార్త రాకూడదని మంత్రి చెప్పారు. హెటిరో డ్రగ్స్ అధినేతతో మాట్లాడి జిల్లాకు కావాల్సిన రెమ్డిసివిర్ ఇంజక్షన్లను తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రిలో 320 పడకలతో కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మధిర, సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ప్రత్యేకంగా కరోనా పడకలు ఏర్పాటు చేసి చికిత్స ప్రారంభిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: కరోనా వేళ నిరాడంబరంగా రంజాన్