తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అందరికీ టీకా ఇస్తాం: మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామ నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. హెడ్‌ నర్సు మేరికి తొలి టీకా వేశారు. టీకా కోసం జిల్లావ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

minister-puvvada-ajay-kumar-and-mp-nama-nageswara-rao-launch-vaccination-at-khammam-district-hospital
ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అందరికీ టీకా ఇస్తాం: మంత్రి పువ్వాడ

By

Published : Jan 16, 2021, 3:15 PM IST

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అందరికీ టీకా ఇస్తాం: మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లాలో జిల్లాలో 15,975మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను గుర్తించామని... వారికి ముందుగా టీకాలు వేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఎంపీ నామ నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. కొవిడ్‌ కేంద్రంలో పనిచేస్తున్న హెడ్‌ నర్సు మేరికి తొలి టీకా వేశారు.

టీకా కోసం జిల్లావ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ఈరోజు 6 కేంద్రాల్లో టీకాలు వేయడం ప్రారంభిస్తామని మంత్రి అన్నారు. రేపటి నుంచి అన్నీ టీకా కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జిల్లాకు 153 వాయిల్స్ వచ్చాయని... త్వరలోనే మరిన్ని అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.

'త్వరలోనే దేశం నుంచి పారదోలుతాం'

పది నెలల పాటు జిల్లాలో కరోనాతో పోరాడిన యోధులకు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే దేశం నుంచి మహమ్మారిని పారదోలుతామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:టీకాతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు: మంత్రి గంగుల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details