ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పోరులో తన సతీమణి వసంతలక్ష్మికి ఆసక్తి లేదని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. మేయర్ ఎవరనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు. నామినేషన్ల గడువు ముగియడంతో తన జన్మదినం రోజైన ఇవాళ్టి నుంచి ప్రచారహోరుకు ఆయన శ్రీకారం చుట్టారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక రెండున్నరేళ్లలో ఖమ్మంలో జరిగిన అభివృద్ధిపై కరపత్రం విడుదల చేశారు.
నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న తెరాను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా ఉనికి ఉండబోదన్నారు. విపక్షాలు గుడ్డి విమర్శలు తప్ప అభివృద్ధి చేయలేవని ఆరోపించారు.