తెలంగాణ

telangana

ETV Bharat / state

oxygen concentrators: 250 కాన్సన్​ట్రేటర్లు సీఎంకు అందజేత - తెలంగాణ తాజా వార్తలు

సీఎం కేసీఆర్​కు 250 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​ అందజేశారు. ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా, పువ్వాడ ఫౌండేషన్ సంయుక్తంగా రెండున్నర కోట్ల రూపాయల విలువైన కాన్సన్​ట్రేటర్ల(oxygen concentrators)ను పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఆయన స్నేహితుడు పి.రామకృష్ణా రెడ్డి చెరో ఐదు లక్షలు సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చారు.

minister puvvada ajay
oxygen concentrators: 250 కాన్సన్​ట్రేటర్లు సీఎంకు అందజేత

By

Published : May 31, 2021, 8:56 AM IST

ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా, పువ్వాడ ఫౌండేషన్ సంయుక్తంగా రెండున్నర కోట్ల రూపాయల విలువైన 250 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్ల(oxygen concentrators)ను ముఖ్యమంత్రి కేసీఆర్​కు అందించాయి. అమెరికా నుంచి దిగుమతి చేసుకుని ప్రగతిభవన్​కు ఆర్టీసీ కార్గో బస్సుల్లో తీసుకొచ్చిన కాన్సన్​ట్రేటర్లను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సీఎంకు అందించారు. వాటిని ఆవిష్కరించిన సీఎం.. మంత్రి పువ్వాడను అభినందించారు.

250 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్ల(oxygen concentrators)ను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల కోసం వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు. అటు సీఎం సహాయనిధికి ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ఐదు లక్షల రూపాయలు, ఆయన మిత్రుడు పి.రామకృష్ణా రెడ్డి మరో ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు చెక్కులను సీఎం కేసీఆర్​కు అందించారు.

వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలకు వైద్య, నర్సింగ్ కళాశాలలను మంజూరు చేసినందుకు మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:అనిశాకు చిక్కిన జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌ డీఈ

ABOUT THE AUTHOR

...view details