మంత్రిపదవి చేపట్టిన తర్వాత తనపై మరింత బాధ్యత పెరిగిందని.. ఎట్టిపరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన బాధ్యతను విస్మరించబోనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు చేరవేయడమే తన కర్తవ్యమన్న మంత్రి పువ్వాడ... సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లా రైతులకు కానుకగా అందిస్తామన్నారు. మంత్రినన్న దర్పం ఎక్కడా ప్రదర్శించబోనని.. మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తానని వెల్లడించారు. తనకు ప్రభుత్వం కేటాయించిన వాహనం స్పీడ్ లిమిట్ దాటడం వల్ల చలానా పడిందన్న వార్తలు సమంజసం కాదని కొట్టిపడేశారు. గోదావరి పడవ ప్రమాద బాధితులకు చేయూతనిచ్చి.. చనిపోయిన వారి కుటుంబాల ఓదార్చి వారికి సాయం చేస్తే.. హెలికాప్టర్లో సెల్ఫీలు దిగారంటూ చేసిన ప్రచారం తనను కలచివేసిందన్నారు.
'మంత్రినన్న దర్పం ఎన్నడూ ప్రదర్శించను' - minister
సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు కానుకగా అందిస్తామన్నారు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. మంత్రినన్న దర్పం ఎక్కడా ప్రదర్శించబోనని.. మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తానని వెల్లడించారు.
మంత్రి