తన వ్యక్తిగత సహాయకుడి తల్లి అనారోగ్యంతో మృతిచెందగా.. ఆమె పాడె మోసి మంత్రి పువ్వాడ తన అనుబంధాన్ని చాటుకున్నారు. మంత్రి పీఏ... ఖమ్మంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన చిరుమామిళ్ల రవికిరణ్ తల్లి దమయంతి మంగళవారం మృతిచెందారు.
పీఏ తల్లి పాడె మోసిన మంత్రి పువ్వాడ
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాడె మోశారు. తన వ్యక్తిగత సహాయకుడు కిరణ్ తల్లి మరణించటంతో.. ఆమె మృతిపట్ల మంత్రి సంతాపం వ్యక్తం చేశారు.
పీఏ తల్లి పాడె మోసిన మంత్రి పువ్వాడ
విషయం తెలుసుకున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్... ఆమె భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు.
ఇదీ చూడండి:లైవ్ వీడియో: కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ఇద్దరు మృతి