ఖమ్మంలో ప్రారంభించిన ఐటీహబ్ రెండోదశ నిర్మాణం చేపట్టాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్... మంత్రి కేటీఆర్‌ను కోరారు. ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిసిన మంత్రి పువ్వాడ అజయ్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం ఐటీ హబ్‌లో 430 సీట్లు ఉండగా... ఇప్పటికే వచ్చిన 14 కంపెనీల అవసరాల కోసం 470 సీట్లు అవసరం. అయితే అదనంగా మరో పది కంపెనీలు కూడా ఆసక్తి చూపుతున్నాయని... అందువల్ల రెండో దశ నిర్మాణాన్ని చేపట్టాలని పువ్వాడ అజయ్ కోరారు.
ఖమ్మం ఐటీహబ్ రెండోదశపై కేటీఆర్‌తో పువ్వాడ భేటీ - మంత్రి పువ్వాడ తాజా వార్తలు
ఖమ్మంలో మూడు రోజుల క్రితం ప్రారంభించిన ఐటీహబ్‌కు మంచి స్పందన వచ్చింది. దీనికి సంబంధించి రెండో దశ నిర్మాణాన్ని చేపట్టాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్... ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం ఐటీహబ్ రెండోదశ నిర్మాణంపై మంత్రి కేటీఆర్‌ను కలిసిన పువ్వాడ
ప్రస్తుత ఐటీ టవర్ ఉన్న ప్రాంతంలోనే మరొకటి నిర్మించేందుకు అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ ప్రతిపాదనపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:'సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు'