తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి అజయ్​కుమార్​ ఎంత దుర్మార్గుడంటే... ప్రశాంత్​రెడ్డి సెటైర్​ - telangana varthalu

మంత్రి అజయ్​కుమార్​పై ప్రశాంత్​రెడ్డి సెటైర్​ వేశారు. బస్టాండ్​ కోసం గతంలో నిధులు ఇవ్వలేదని తన ఫోర్ట్​పోలియో అయిన రవాణా శాఖను లాక్కున్నారని ప్రశాంత్​రెడ్డి నవ్వులు పూయించారు.

minister prashanth reddy
అజయ్​కుమార్​ ఎంత దుర్మార్గుడంటే... ప్రశాంత్​రెడ్డి సెటైర్​

By

Published : Apr 2, 2021, 3:52 PM IST

అజయ్​కుమార్​ ఎంత దుర్మార్గుడంటే... ప్రశాంత్​రెడ్డి సెటైర్​

పట్టణాభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్​ ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్​రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ ఏ పథకం ప్రారంభించినా... ఆ పథకాన్ని ఖమ్మంకు తీసుకొచ్చేది మంత్రి అజయ్​కుమార్​ అని ప్రశాంత్​రెడ్డి తెలిపారు. 'ఆయన ఎంత దుర్మార్గుడంటే...' అంటూ నవ్వుతూ మంత్రి అజయ్​కుమార్​పై సెటైర్​ వేశారు.

బస్టాండ్​ కోసం నిధులు ఇవ్వలేదని మనసులో పెట్టుకుని గతంలో తన ఫోర్ట్​పోలియో అయిన రవాణా శాఖను లాగేసుకున్నారని ప్రశాంత్​రెడ్డి నవ్వులు పూయించారు. తన దగ్గర నుంచి ఆ ఫోర్ట్​పోలియో గుంజుకుని మరి ఖమ్మం బస్టాండ్​ను నిర్మించారని... అంటే మంత్రి అజయ్​ అంత పట్టుదల గలవారని ప్రశాంత్​రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి: పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details