మండల కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులు స్థానికంగా నివాసం ఉండకుండా దూర ప్రాంతాల్లో ఉంటూ.. కార్యాలయాలకు ఆలస్యంగా వస్తున్నారనే విషయం మంత్రి పువ్వాడ, ఖమ్మం జిల్లా కలెక్టర్ సాక్షిగా బట్టబయలైంది. మంత్రి వస్తున్నారని ముందస్తు సమాచారం అధికారులకు తెలిసినా.. తమకేమీ పట్టనట్లుగా ప్రవర్తించారు. తల్లాడలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పర్యటన సందర్భంగా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వచ్చారు.
మంత్రి రాకకు 10 నిమిషాల ముందు వచ్చిన వారు.. పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న జిల్లా సహకార బ్యాంక్ పరిశీలనకు వెళ్లారు. ఆ సమయంలో బ్యాంకు తెరిచి ఉన్నా.. సిబ్బంది ఒక్కరూ లేకపోవడం వల్ల ఆశ్చర్యపోవడం వారి వంతైంది. చేసేదేమిలేక ఎమ్మెల్యే, కలెక్టర్ తిరిగి వెళ్లారు.