రెండో ఫేస్ ఐటీ హబ్ భవన నిర్మాణ శంకుస్థాపనకు మంత్రి కేటీఆర్ రేపు ఖమ్మం జిల్లాకు విచ్చేయనున్నారు. ఈ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వటం పట్ల ఐటీ హబ్ సమన్వయకర్త లాక్స్ చేపూరి ధన్యవాదాలు తెలిపారు.
ఖమ్మంలో ఐటీ హబ్ రెండో ఫేస్‌కు రేపు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన - Minister KTR latest news
ఖమ్మం జిల్లాలో ఐటీ హబ్ రెండో ఫేస్ భవన నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి ఇవ్వటం పట్ల ఐటీ హబ్ సమన్వయ కర్త లాక్స్ చేపూరి ధన్యవాదాలు తెలిపారు.
ఐటీ హబ్ రెండో ఫేస్ భవన నిర్మాణం
మొదటి ఫేస్ భవనంలో ఖమ్మంకు చెందిన సుమారు 432 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించామన్నారు. తమ పనితీరును మొచ్చుకుని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మరో భవనం నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రెండో ఫేస్‌లో తమ బ్రాంచ్‌లో పెద్ద పెద్ద కంపెనీలు ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు.
ఇదీ చదవండి: ఈ అవార్డు వారికి అంకితమిస్తున్నా: రజనీ