తెలంగాణ

telangana

ETV Bharat / state

Minister Harish Rao: 'పేదలకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకే క్యాథ్​లాబ్​' - Cardiac Catheterisation Laboratory

Catheterization Lab at Khammam Hospital: పేదలకు ఆధునిక వైద్య సేవలు అందించడం కోసమే రాష్ట్రంలో క్యాథ్‌ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన ల్యాబ్​ను ఆయన జిల్లా మంత్రి పువ్వాడతో కలిసి ప్రారంభించారు. క్షతగాత్రులకు తక్షణ సేవలు అందించేలా ట్రామాకేర్​ సెంటర్​ను ఖమ్మంలో ఏర్పాటు చేశామని.. త్వరలోనే రేడియో, కీమో థెరపీ కేంద్రాలు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.

Minister Harish Rao
Catheterization Lab at Khammam Hospital

By

Published : Jan 28, 2022, 12:57 PM IST

Updated : Jan 28, 2022, 1:07 PM IST

Cath lab at Khammam Hospital: ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాథ్‌ల్యాబ్​ను మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. గాంధీ, నిమ్స్, ఉస్మానియా తర్వాత ఖమ్మంలోనే క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. పేదలకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకే క్యాథ్​లాబ్​ అందుబాటులోకి తెచ్చామన్నారు.

''రాష్ట్రంలో 4వ క్యాథ్​ల్యాబ్​ను ఖమ్మంలో ఏర్పాటు చేశాం. పేదలకు ఆధునిక వైద్య సేవల కోసమే క్యాథ్‌ల్యాబ్ అందుబాటులోకి తెచ్చాము. త్వరలోనే ఆదిలాబాద్‌లో కూడా క్యాథ్‌ల్యాబ్‌ ఏర్పాటు చేస్తాం. ఖమ్మంలో 100 పడకల ట్రామాకేర్ సెంటర్‌ను సైతం ప్రారంభించాం. క్షతగాత్రులకు తక్షణ వైద్యసేవలు అందేలా ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో రెండో మిల్క్ బ్యాంకును ఖమ్మంలో ప్రారంభించాం.

మధిర, సత్తుపల్లిలో రూ.34 కోట్ల చొప్పున 100 పడకల ఆస్పత్రుల ఏర్పాటు చేసి.. రేడియో, కీమోథెరపీ కేంద్రాలు అందుబాటులోకి తెస్తాం. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లోని మార్చురీలను ఆధునీకరిస్తాం. ఖమ్మం మార్చురీని కూడా తీర్చిదిద్దుతాం.''

-హరీశ్ రావు, మంత్రి

ఖమ్మంలో క్యాథ్​ల్యాబ్ ఏర్పాటు

తెలంగాణలో కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం బాగా పనిచేస్తోందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే నిర్వహించామన్నారు. 77 లక్షల ఇళ్లల్లో జ్వర సర్వే చేసి... 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామని వెల్లడించారు. 23 జిల్లాల్లో ఫీవర్ సర్వేను పూర్తి చేశామని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:TS Drugs Case: డ్రగ్స్ కేసులో రేపు టోనీని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 28, 2022, 1:07 PM IST

ABOUT THE AUTHOR

...view details