తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకూడదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. ఖమ్మంలో ధాన్యం కొనుగోళ్లపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గన్నీ సంచులు సరిపడా ఉన్నాయని మంత్రి తెలిపారు. అన్ని కేంద్రాలకు సమానంగా గన్నీ సంచులు పంచాలని పేర్కొన్నారు. పండించిన ప్రతి ధాన్యం గింజను రైతు అమ్ముకొని.. వారి అకౌంట్లలో డబ్బులు పడే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
''కొన్ని నల్గొండ, సూర్యాపేట పంపించాం. గతంలో కంటే ఇప్పుడు పంట పెరిగింది. గన్నీ సంచులు అదనంగా ఉన్నాయి. అన్ని కేంద్రాలకు సమానంగా గన్నీ సంచులు పంచాలి. రాష్ట్రంలో 4 కోట్లు గన్నీ సంచులు ఉన్నాయి. రైతును కొనుగోలు కేంద్రానికి పరిమితం చేయాలి. రైతులను మిల్లు వద్దకు పంపి ఇబ్బంది లేకుండా చూడాలి.''
- గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి