తెలంగాణ

telangana

ETV Bharat / state

'వైరాలో అభివృద్ధి పనుల జాప్యంపై మంత్రి ఆగ్రహం' - Minister Puvvaada Ajay Fire in vaira

ఖమ్మం జిల్లా వైరా పురపాలికలో అభివృద్ధి పనుల జాప్యంపై రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆయన పట్టణంలో అభివృద్ధి పనులు పరిశీలించారు.

Minister Fire
Minister Fire

By

Published : Mar 3, 2020, 9:27 PM IST

ఖమ్మం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా జిల్లాలోని వైరా పట్టణంలో ఆయన పర్యటించారు. వైరా జలాశయంపై ట్యాంక్‌బండ్‌ పనుల ఆలస్యంపై నీటిపారుదలశాఖ అధికారులు, గుత్తేదారులను ప్రశ్నించారు. బిల్లులు రావడం లేదని వారు చెప్పగా... చేసిన పనికి ప్రభుత్వం కచ్చితంగా చెల్లింపులు చేస్తుందన్నారు.

అక్కడ్నుంచి మున్సిపల్​ కార్యాలయంలో సభకు హాజరయ్యారు. పుర ఎన్నికలకు ముందు రూ.25 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తే... నేటికీ పనులు ఎందుకు ప్రారంభం కాలేదని పాలకమండలి సభ్యులు, కమిషనర్‌ను ప్రశ్నించారు. పనులు చేయకుంటే గుత్తేదారును మార్చండి... లేదంటే నాకు చెప్పండి... నేను పంపిస్తా అంటూ మండిపడ్డారు. శిలాఫలకం లాగి వెళ్లాం... పట్టించుకోరనుకోకండి... పనులు చేయకుంటే అందరికీ నష్టమని చెప్పారు. పనులను పర్యవేక్షించాలని ఎమ్మెల్యే రాములునాయక్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ స్నేహలతలను ఆదేశించారు.

'వైరాలో అభివృద్ధి పనుల జాప్యంపై మంత్రి ఆగ్రహం'

ఇదీ చూడండి :'రామోజీ గ్రూప్‌ సంస్థల్లో భద్రతా చర్యలు అభినందనీయం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details