తెలంగాణ

telangana

ETV Bharat / state

సెంట్రల్​ లైటింగ్​ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్​ - khammam district news

ఖమ్మంలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్​ లైటింగ్​ను మంత్రి పువ్వాడ అజయ్ ​కుమార్​ ప్రారంభించారు. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.

minister ajaykumar inaugarated central lighting in khammam
సెంట్రల్​ లైటింగ్​ను ప్రారంభించిన మంత్రి అజయ్​

By

Published : Jun 13, 2020, 9:51 PM IST

ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులతో ఖమ్మంలోని రోడ్ల రూపం మారిపోయిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ‌కుమార్‌ తెలిపారు. ఖమ్మం పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌ను మంత్రి ప్రారంభించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సహాయంతో ఖమ్మం రూపు రేఖలు మార్చామని అజయ్​ కుమార్​ అన్నారు. మొత్తం 13 వీధులకు డివైడర్లు నిర్మించి సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details