ఖమ్మంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెక్కులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంత్రి తన క్యాంపు కార్యాలయంలో 28 మంది లబ్ధిదారులకు రూ.10.93 లక్షల విలువైన చెక్కులను అందచేశారు. ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గంలో సుమారు 2 కోట్ల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందచేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్ పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి
ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి అజయ్ కుమార్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుంటుందని మంత్రి పేర్కొన్నారు.
లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన మంత్రి