తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆస్తుల గణనతో హక్కు కల్పించేందుకు ప్రభుత్వం కృషి: మంత్రి అజయ్​ - khammam district latest news

ఖమ్మం జిల్లాలో మంత్రి అజయ్​కుమార్​ పర్యటించారు. వ్యవసాయేతర ఆస్తుల గణన ద్వారా హక్కు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

Minister Ajay Kumar
ఆస్తుల గణనతో హక్కు కల్పించేందుకు ప్రభుత్వం కృషి: మంత్రి అజయ్​

By

Published : Oct 1, 2020, 11:05 PM IST

భద్రత లేని ప్రతీ ఇంటి యజమానికి వ్యవసాయేతర ఆస్తుల గణన ద్వారా హక్కు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని భద్రత లేకుండా ఉన్న నిరుపేదలకు సర్వే పూర్తయిన తర్వాత మెరూన్ రంగు పాసు పుస్తకాలు అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలలో పర్యటించిన మంత్రి.. ఆస్తుల గణనను పరిశీలించారు. స్థానికులు పలు కాలనీల వాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతీ ఇంటి వివరాలు యాప్​లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రితోపాటు కలెక్టర్ కర్ణన్, కమిషనర్ అనురాగ్ జయంతి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details