ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని సూర్యాపేట- ఖమ్మం జాతీయ రహదారుల మధ్య ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. అలాగే నాయకన్ గూడెం, నేలకొండపల్లి, తిరుమలాయ పాలెం మండలాల్లో పర్యటించి కొవిడ్-19 వైరస్ వ్యాప్తి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గ్రీన్ జోన్లోకి వచ్చేవరకు అప్రమత్తంగా ఉండాలి: అజయ్ - corona latest news in telangana
సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల సూర్యాపేట- ఖమ్మం జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ పరిశీలించారు.

Minister Ajay kumar latest news
ప్రజలందరూ సామాజిక దూరం పాటించి... ఇంట్లోనే ఉండి కరోనా వ్యాప్తిని నిర్మూలించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇతర జిల్లాల నుండి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఖమ్మం జిల్లా ఆరంజ్ నుంచి గ్రీన్ జోన్లోకి వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలను మూసివేసి... తనిఖీలను ముమ్మరం చేయాలని పోలీసులను ఆదేశించారు.