తెలంగాణ

telangana

ETV Bharat / state

మత్య్సకార కుటుంబాలను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి పువ్వాడ - ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోటపాడు

ఖమ్మం జిల్లాలో చేపపిల్లల పంపిణీ ద్వారా ఈ ఏడాది 18,848 మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ అన్నారు. కోటపాడులోని చెరువులో ఆయన చేపపిల్లలను వదిలారు.

minister ajay kumar said Encouraging fishing families
మత్య్సకార కుటుంబాలను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి పువ్వాడ

By

Published : Aug 9, 2020, 4:58 PM IST

మత్య్సకార కుటుంబాలను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోటపాడులోని చెరువులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ చేప పిల్లలను విడుదల చేశారు. ఈఏడాది జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో ఉచితంగా 345.48 లక్షల చేప పిల్లలు విడుదల చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 177 మత్స్య శాఖ సోసైటీల పరిధిలో 194 ప్రధాన చెరువులు, గ్రామ పంచాయతీల పరిధిలో మరో 1089 చెరువులు, కుంటలు ఉన్నాయన్నారు.

పాలేరు, వైరా, లంకాసాగర్‌ రిజర్వాయర్లలో చేపల పెంపకం సాగుతుందన్నారు. చేపల ఉత్పత్తిలో రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మూడో స్థానంలో ఉందన్నారు. ఈఏడాది రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :ఆదివాసీలు అన్ని రంగాల్లో మెరుగవ్వాలి

ABOUT THE AUTHOR

...view details