తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో ఒక్క కరోనా కేసు లేదు: మంత్రి పువ్వాడ - minister puvvada ajay kumar latest news

ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకుఒక్క కరోనా పాజిటివ్ ​కేసు నమోదు కాలేదని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ స్పష్టం చేశారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్​ వార్డును జిల్లా కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​తో కలిసి పరిశీలించారు.

Minister Pawwada Ajay Kumar examines the corona ward
ప్రభుత్వాసుపత్రిలో కరోనా వార్డును పరిశీలించిన మంత్రి

By

Published : Apr 5, 2020, 11:54 AM IST

ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కరోనా రోగుల కోసం ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వార్డును జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్​తో కలిసి పరిశీలించారు.

ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో 50 ఐసీయూ పడకలతో పాటు 70 సాధారణ పడకలు సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని... కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వెయ్యి పడకలతో క్వారంటైన్​ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

ప్రభుత్వాసుపత్రిలో కరోనా వార్డును పరిశీలించిన మంత్రి

ఇవీ చూడండి:ప్రతి రోజూ 100 గ్రాముల పండ్లు తప్పక తినాలి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details