ఖమ్మం జిల్లాలో చిక్కుకుపోయిన వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా తమ వివరాలు నమోదు చేసుకోవడానికి ఖమ్మం నగరంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు రాత్రి భారీగా తరలివచ్చారు. వాళ్లు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసి వారి వివరాలు తీసుకుంటున్నారు పోలీసులు.
పాసుల కోసం పోలీస్ స్టేషన్ ముందు క్యూ - migrant labours waiting for pass in khammam
కలో గంజో అక్కడే తాగుతామని ఖమ్మం జిల్లాలో ఉన్న ఇతర రాష్ట్రాల కార్మికులు సొంతూళ్ల బాట పట్టారు. వెళ్లేవాళ్లు వివరాలు నమోదు చేసుకోవడానికి పట్టణంలో 1వ పోలీస్ స్టేషన్‌కు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
![పాసుల కోసం పోలీస్ స్టేషన్ ముందు క్యూ migrant labours waiting at police station for moving passes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7108497-thumbnail-3x2-kmm.jpg)
పాసుల కోసం... పోలీస్ స్టేషన్ ముందు క్యూ లైన్
వీరిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, పశ్చిమ బంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.
ఇదీ చూడండి:మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షం.!