ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో దాతలు కూలీలకు రోజూ అన్నదానం చేస్తున్నారు. సంపన్నులే కాకుండా చిన్న వ్యాపారులు సైతం తోడుగా నిలుస్తున్నారు. బీఎన్ తండాకు చెందిన చేపలు విక్రయించే సుగణమ్మ తన ఇంట్లో వంటలు తయారు చేయించి కూలీలకు అన్నదానం చేసింది.
వలస కూలీలకు రోజూ అన్నదానం... చిరు వ్యాపారుల ఔదార్యం - petty traders free launch
కరోనా నేపథ్యంలో తమ ప్రాంతాలకు వెళ్లలేక చిక్కుకున్న వలస కూలీలకు తామున్నామంటూ ఖమ్మం జిల్లా ఏన్కూరులో దాతలు సాయం చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న కూలీలకు అన్నదానం చేస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు.
వలస కూలీలకు రోజూ అన్నదానం... చిరు వ్యాపారుల ఔదార్యం
ఆదర్శంగా నిలిచిన ఆమెను పలువురు అధికారులు అభినందించారు. ఈనెల 13న టీఎస్ యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సంఘం నాయకులు రాయమాధారంలో 250 మందికి భోజనం అందించారు. మాస్టర్ ఇ.కె సేవాసంస్థ, భాజపా మండల కమిటీ, ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో పలువురికి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి :ఇంట్లోనే ఉన్నారు... కరోనాను జయించారు