ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మెగా హరితహారం ర్యాలీ నిర్వహించారు. ఆషా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు మట్టా దయానంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పలు పాఠశాలలు, ళాశాలలకు చెందిన సుమారు రెండు వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జెండా ఊపి ప్రారంభించారు. డిగ్రీ కళాశాల నుంచి వేంసూరు రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు.
కేసీఆర్ జన్మదినాన 2000 మందితో మెగా హరితహారం - KCR BIRTHDAY CELEBRATIONS IN SATTUPALLY
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని పలు పాఠశాల, కళాశాల విద్యార్థులు పెద్దఎత్తున మెగా హరితహారం ర్యాలీ నిర్వహించారు.
MEGA HARITHAHARAM HELD ON OCCASION OF KCR BIRTHDAY IN SATHUPALLY
పర్యావరణ పరిరక్షణకు చెట్లు మూలాధారమని... ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని దయానంద్ తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి హరితహారంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వచ్చే జన్మదినానికి చెట్లను బహుమతిగా చూపించాలని కోరారు.
ఇవీ చూడండి:ట్విట్టర్ ట్రెండింగ్లో హ్యాపీ బర్త్డే కేసీఆర్
TAGGED:
MEGA HARITAHARAM RALLY