తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్య సిబ్బందిని వెంటనే నియమించాలి : విపక్ష నేతలు - khammam district latest news

ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నియామకం చేపట్టాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని కోరారు.

వైద్య సిబ్బందిని వెంటనే నియమించాలి : విపక్ష నేతలు
వైద్య సిబ్బందిని వెంటనే నియమించాలి : విపక్ష నేతలు

By

Published : Aug 23, 2020, 6:19 PM IST

ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నియామకం చేపట్టాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సంబంధిత సిబ్బంది నియామకంతో మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.

ఆస్పత్రి సందర్శన...

సీపీఎం, సీపీఐ, సహా న్యూ డెమోక్రసీ, తెదేపా, జన సమితి పార్టీ నేతలు జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించారు. ప్రజలకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న కొవిడ్ ఐసోలేషన్ వార్డులో కలియతిరిగారు. అనంతరం సిబ్బందితో మాట్లాడారు.

కరోనా పరీక్షల సంఖ్య పెంచాలి...

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్టు లేరని... నియామింపజేయాలని సిబ్బంది నేతల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో కరోనా పరీక్షలు పెంచాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రసాద్, సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, తెదేపా నాయకుడు రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : వరదల నష్టాన్ని.. సీఎం దృష్టికి తీసుకెళ్తా : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

ABOUT THE AUTHOR

...view details