కరోనా విస్తరిస్తోన్న సమయంలోనూ వారాంతపు రోజుల్లో ఖమ్మం జిల్లా పట్టణ ప్రజలు మాంసం దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. చేపలు మార్కెట్లు, చికెన్ షాపులు, ఇతర మాంసం దుకాణాలు నగర వాసులతో కిటకిటలాడాయి.
కరోనా వేళా.. వారాంతాల్లో మాంసం దుకాణాల కళకళ - latest news of khammam
కరోనాను బేఖాతరు చేస్తూ వారాంతపు రోజుల్లో మాంసం దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఖమ్మం పట్టణంలోని మాంసం దుకాణాలన్నీ కొనుగోలు దారులతో కిక్కిరిసిపోయాయి.
కరోనా వేళా.. వారాంతాల్లో మాంసం దుకాణాల కళకళ
చేపల దుకాణాల వద్ద కనీస జాగ్రత్తలు చేపట్టకుండా నగరవాసులు విక్రయాలు జరిపారు. చికెన్, మటన్ దుకాణాల వద్ద దుకాణ యజమానులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.
ఇదీ చూడండి:కన్నా.. బెంగ వద్దురా అనడమే అసలైన మందు.!