తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు వారి ఉనికిని కాపాడుకునేందుకు అనేక కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారుల పనులను అడ్డుకుంటున్నారు.
ఉనికిని కాపాడుకునేందుకు మావోయిస్టుల చర్యలు - మావోల హల్చల్ వార్తలు ఖమ్మం జిల్లా
మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకునేందుకు అనేక కార్యకలాపాలు సాగిస్తున్నారు. తాజాగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో రహదారి పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బీజాపూర్ జిల్లాలో ఉసురు నుంచి పూజారి కాంకేర్ వరకు వేస్తున్న రహదారి పనులు నిలిపి వేసేలా కందకాలు తవ్వారు.
ఉనికిని కాపాడుకునేందుకు మావోయిస్టుల చర్యలు
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని ఉసురు నుంచి పూజారి కాంకేర్ వరకు వేస్తున్న రహదారి పనులు నిలిపి వేయాలని ఉరుసు వద్ద రోడ్లపై మావోయిస్టులు కందకాలు తవ్వారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో రహదారులు నిర్మిస్తే మావోయిస్టుల ఉనికికి ఆటంకం కలుగుతుందని భావించి ఈ చర్యకు పాల్పడ్డారని స్థానికులు చెప్పుకుంటున్నారు.
ఇదీ చదవండి:మావోయిస్టులూ.. ఆయుధాలు వదిలి లొంగిపోండి