'సాగర్ ఆయకట్టులో ప్రతి ఎకరాకు నీరందేలా చర్యలు' - ఆయకట్టుపై మంత్రి అజయ్ రివ్యూ
ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టులోని ప్రతి ఎకరానికి సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులకు ఆదేశించారు.
సాగర్ ఆయకట్టులో ప్రతి ఎకరాకు నీరందేలా చర్యలు
ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టులోని ప్రతి ఎకరానికి సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులకు ఆదేశించారు. ఖమ్మం టీటీడీసీలో జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పాల్గొన్న మంత్రి... సాగర్ జలాల విడుదలపై అధికారులకు స్పష్టత నిచ్చారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఆర్ వీ కర్ణన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య రాములు నాయక్, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.