Gram panchayat Funds : గ్రామ పంచాయతీలు ప్రజాధనం అంటే బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2.12 లక్షల ఆడిట్ అభ్యంతరాలు ఉన్నాయి. ఒక్కో జిల్లాలో వేలాది ఆడిట్ అభ్యంతరాల్లో బడ్జెట్ ఆమోదం లేకుండానే వ్యయం చేస్తున్న వ్యవహారాలు వెలుగు చూశాయి. ఖమ్మం జిల్లాలో ఆడిట్ అభ్యంతరాలు అత్యధికం ఉండగా మహబూబాబాద్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో పదివేలకుపైగా ఉన్నాయి.
Gram panchayat Funds : గ్రామపంచాయతీల్లో ఇష్టారాజ్యం.. కొత్త చట్టంతో మారని రూపురేఖలు - తెలంగాణలో గ్రామపంచాయతీలు
Gram panchayat Funds : గ్రామ పంచాయతీలు ప్రజాధనం అంటే బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయి. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నా సర్పంచులు ఖాతరు చేయడంలేదు. అత్యధిక గ్రామ పంచాయతీలు కోట్ల రూపాయలు ఖర్చు చేయడంలో ఎలాంటి నిబంధనలు పాటించడంలేదని రాష్ట్ర ఆడిట్ శాఖ నిగ్గు తేల్చింది.
నిధుల దుర్వినియోగం, పనుల్లో నాణ్యతలోపం వంటివి పరిపాటిగా మారాయని అధికారులు చెబుతున్నారు. బడ్జెట్ ఆమోదం లేకుండా ఎలాంటి ఖర్చులు చేయకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులదే అయినా వారు పట్టించుకోవడంలేదు. బడ్జెట్లో ఆమోదించిన వాటిని అదే ఆర్థిక సంవత్సరంలోపు వ్యయం చేయాలి. అదనపు కేటాయింపులకు పంచాయతీ విస్తరణాధికారి అనుమతి విధిగా తీసుకోవాలి. బడ్జెట్‌లో చేర్చని పద్దుపై ఖర్చు చేయరాదు. కేటాయింపుల కంటే ఎక్కువ వ్యయం చేయకూడదు. అలా చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటారు.ఆడిట్ అభ్యంతరాలకు సమాధానాలివ్వడంతో పాటు ఆర్థికఅంశాలపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా అధికారులను పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ ఎ.శరత్ ఆదేశించారు.
ఇదీ చూడండి :Substandard Fertilizers : ‘నిర్జీవ’ ఎరువులు.. రైతుల కష్టానికి తెగుళ్లు..